*మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన జనవాణి భరోసా కార్యక్రమం..*- *ప్రజా సమస్యల పరిష్కారమే జనసేనలక్ష్యం..*
- *జనవాణీ జనసేన భరోసా కార్యక్రమం ప్రజా సమస్యలు పరిష్కారానికి వేదికగా నిలుస్తుంది..*
- *ప్రజల సమస్యలే జనసేన పార్టీ అజెండా అనే సిద్ధాంతం తో పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు..*
- *ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు.*
మంగళగిరి, సెప్టెంబర్ 21:- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు పరిష్కారమే జనసేన లక్ష్యం, జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి 30 కు పైగా అర్జీలను స్వీకరించిన ఆయన, జనసేన జనవాణి భరోసా కార్యక్రమం ప్రజా సమస్యలు పరిష్కారానికి వేదికగా నిలుస్తుందన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళాలనే ఆలోచనతో జనసేన పార్టీ జనవాణి భరోసా ప్రారంభించారన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల కోసమే కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికే అన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ వేదిక ప్రభుత్వం ఉన్న లేకపోయినా అనునిత్యం రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పలువురు అర్జీదారులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి తక్షణమే పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. భూ సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, వైద్య సహాయం, రైతు సమస్యలు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో ప్రజల సమస్యలు వినిపించే పరిస్థితి లేకపోయిందని, కానీ జనసేన పార్టీ మాత్రం ప్రజాస్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే వారధిగా నిలుస్తుందన్నారు. ప్రజలే పార్టీకి బలం, ప్రజల సమస్యలే పార్టీ అజెండా అనే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగిందని, సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా పాలన కొనసాగుతోందని, జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో విజయవాడ లీగల్ సెల్ అధ్యక్షులు సంపర సతీష్ కుమార్ గారు, విజయవాడ రీజనల్ కో ఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి గారు, రాష్ట్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ. డైరెక్టర్ బండారు రవికాంత్ గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారు తదితరులు పాల్గొన్నారు..

