Ticker

6/recent/ticker-posts
Showing posts with the label అమరావతి విజయ హాసంShow all
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర .డిమాండ్‌ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని, ఎరువులు, పురుగుమందుల వినియో గాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని’ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మత్య్స పరిశ్రమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ‘మారుతున్న వాతావరణ పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం’పై సదస్సును ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాగు చేసి అధిక దిగుబ డులు సాధిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు
Load More That is All