Ticker

6/recent/ticker-posts

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం లో సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు

11-09-2026, పోలవరం, విజయహాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ: సహాయనిధి చెక్కులు అందజేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి  బాలరాజు తేదీ: 11-09-2026


సీఎం సహాయ నిధిలో భాగంగా పోలవరం నియోజకవర్గానికి 28వ విడతగా 51 చెక్కులు మంజూరు – రూ.83 లక్షల 23 వేలవిలువైన చెక్కులను బాధితులకు అందజేయనున్న ఎమ్మెల్యే చిర్రిబాలరాజ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వంముందుకు సాగుతోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుఅన్నారు.శుక్రవారం బర్రింకాలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుక్కునూరు మండలానికి చెందిన పల్లేల  మారేశ్వరికి రూ.66,572 విలువైన సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గానికి 28వ విడతగా 51 చెక్కులు మంజూరయ్యాయని, మొత్తం రూ.83 లక్షల 23 వేల విలువైన చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి అందజేస్తామని తెలిపారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కుక్కునూరు మండల జనసేన నాయకులు మంత్రి గోపాలకృష్ణ, చల్లా కోటి, గాడిద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.