ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11ఘనంగా ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న గారి జన్మదిన వేడుకలు జరిగాయి.
September 11, 2026
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11: ఎంపీపీ పాలడుగుజ్యోత్స్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలు పాలడుగు జ్యోత్స్న గారి జన్మదిన వేడుకలను శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పాల్గొని ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ అక్కల రామమోహన్ రావు (గాంధీ) గారు, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పాలడుగు జ్యోత్స్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు