Ticker

6/recent/ticker-posts

మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా. అనగా ది.22.09.2026న మంగళవారం నాడు గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారి కార్యక్రమాల వివరాలు.


 విజయహాసం ఎడిటర్అ ఎంవివిసత్యనారాయణ :మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా. అనగా ది.22.09.2026న మంగళవారం నాడు గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారి కార్యక్రమాల వివరాలు.

ఉదయం 10 గంటలకు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. 

కొండపల్లి అనుమోలు కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు జి.కొండూరు మండలం పినపాక గ్రామంలోని ఎస్సీ ఏరియాలో రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

సాయంత్రం 4 గంటలకు జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు.

సాయంత్రం 4:30 గంటలకు జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో రూ.25లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రూ.15 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయమన్నారు.

సాయంత్రం 5 గంటలకు జి.కొండూరులో స్మశాన వాటికకు వెళ్లే రహదారి మార్గంలో పులివాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం జి.కొండూరులో రజకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

జి.కొండూరులో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో కూటమి కుటుంబ సభ్యులంతా పాల్గొన ప్రార్ధన

మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.