ఆశ్రం మెడికల్ కాలేజ్ & హాస్పిటల్స్ ఆధ్వర్యంలోACRI (ఆశ్రం సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్ & ఇన్నోవేషన్) సదస్సు ముగింపు కార్యక్రమం*సదస్సులో పాల్గొన్న అమెరికాలోని జార్జ్ గౌన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఆంకాలజీ ప్రొఫెసర్ & శాస్త్రవేత్త డా. మారియా లారా
ఏలూరు, సెప్టెంబర్, 20: ఆశ్రం మెడికల్ కాలేజ్ & హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ACRI (ఆశ్రం సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్ & ఇన్నోవేషన్ సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజ్ లో జరిగింది. క్లినికల్ రీసెర్చ్ & ట్రాన్స్లేషనల్ మెడిసిన్ సదస్సులో దేశ, విదేశాల నుంచి ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు ఈ సదస్సులో 500 పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు. అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఆంకాలజీ ప్రొఫెసర్ & శాస్త్రవేత్త డా. మారియా లారా ఈ కార్యక్రమంలో పాల్గొని, క్యాన్సర్, డయాబెటిస్, లివర్ డిసీజెస్ వంటి అనేక వ్యాధులపై జరుగుతున్న పరిశోధనలు, వాటి ఆధునిక చికిత్సా విధానాల గురించి వివరించారు. ఆశ్రం మెడికల్ కాలేజ్ & హాస్పిటల్స్ మరియు జార్జన్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిశోధన కార్యక్రమాల గురించి కూడా వివరించారు. పరిశోధన రంగంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ACRI (ఆశ్రం సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్ & ఇన్నోవేషన్ కేంద్రాన్నిఆసుపత్రి డైరెక్టర్ రతీదేవి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య బృందం ACRI మ్యాగజైన్‌ను ప్రారంభించారు. ఈ మ్యాగజైన్ లో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, వైద్య పరిశోధనలు మరియు పరిశోధనా రంగంలోని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను అందించడం జరుగుతుందని చెప్పారు.
ఆశ్రమ్ ఆసుపత్రి డైరెక్టర్ రతిదేవి, CEO డా. కె. హనుమంతరావు ,, ప్రిన్సిపాల్ డా. చెబ్రోలు శ్రీనివాస్ ,మెడికల్ సూపరింటెండెంట్ డా.డి.వెంకటేష్ ,, ACRI వైస్ ప్రెసిడెంట్ డా.కె.వంశీ కృష్ణ ,, ప్రొఫెసర్లు, వైద్యులు మరియు పరిశోధకులు పాల్గొన్నారు.

