పోలవరం, విజయహాసం పత్రిక ఎడిటర్ ఎంవివిసత్యనారాయణ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.
23-09-2026భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఅధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలి
– పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ
మూడు రోజులలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలవరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు.
భారీ వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అధికారులు తమ ప్రధాన కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఎమ్మెల్యే తెలిపారు.
అవసరమైన పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

