ఎన్టీఆర్ భరోసా పింఛను చెల్లింపులు 01.10.2026 మధ్యాన్నం నుండి ప్రారంభం-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, సెప్టెంబర్, 24 : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను చెల్లింపులు 01.10.2026 మధ్యాన్నం నుండి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ బ్యాంకు ఉద్యోగులు ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు సమ్మె కారణముగా ఏలూరు జిల్లా లో అక్టోబర్,2026 నెలకు సంబంధించి పించను పంపిణి నిమిత్తం అక్టోబర్ 1 వ తేదీన బ్యాంకుల నుండి నగదు విత్ డ్రా చేసి అదే రోజున పంపిణి చేయడం జరుగుతుందని, కావున పించను దారులు అందరు పై మార్పు ను గ్రహించాలన్నారు. అక్టోబర్ 1 వ తేదిన పించను తీసుకోని వారికి 3 వ తేదీ న పంపిణీ చేయబడుతుందన్నారు. , . జిల్లాలో సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటులు చేయడమైనదన్నారు. అక్టోబర్, 1 వ తేదిన ఉదయం బ్యాంకుల నుండి సిబ్బంది నగదు withdrawal చేసి,సంబంధించిన నగదు అందుబాటులో ఉంచవలసినదిగా పించను పంపిణికి ఎటువంటి నగదు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు. పింఛను పొందేందుకు పింఛను దారులు సచివాలయ సిబ్బంది ద్వారా వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
. ఈ కార్యక్రమములో డి.ఆర్.డి.ఎ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి , ఇంచార్జ్ జెడ్పి సీఈఓ మరియు డిపిఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

