Ticker

6/recent/ticker-posts

6/10/2026.ఉయ్యూరు,. అమరావతి జయ హాసం ఎడిటర్ ఎంవివి సత్యనారాయణ: ఉయ్యూరు ప్రజల అవసరాలను గుర్తించి వారికి మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది;;; మాజీ ఎమ్మెల్సీ వై. వి. బి. రాజేంద్రప్రసాద్ గారు.

ఈరోజుఉయ్యూరు పట్టణంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారితో కలిసి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేశారు. 

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ..

ఉయ్యూరు పట్టణ ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక వసతుల పై ప్రత్యేక దృష్టి సారిoచడం జరిగిందని, ఉయ్యూరు మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాజేంద్రప్రసాద్  అన్నారు.

ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రతిపక్ష వైసిపి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతుందని గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తాము ఏమి చేస్తున్నామో ప్రజల ముందే చెప్పి అభివృద్ధి చేసి చూపిస్తున్నామని బోడె ప్రసాద్  అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధికారులు అనధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.