*జంగారెడ్డిగూడెం, విజయహాసం ఎడిటర్ సత్యనారాయణ : అంటేనే ఉజ్వలం* రోషన్ ఉన్న చోట ఆ ప్రాంతం ప్రకాశవంతం గా ఉంటుందని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ TG వెంకటేశ్ కొనియాడారు.శనివారం జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్ లో ఏలూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు శాసనసభ్యులు రోషన్ కుమార్ తగిన గుర్తింపు, ఆదరణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇది శుభపరిణామం అని ఆయన కితాబిచ్చారు. ఆర్యవైశ్యులు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని పిజి వెంకటేష్ పిలుపునిచ్చారు.
*ఆర్యవైశ్యులను గుర్తించింది తెలుగుదేశం పార్టీ*
-- *చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ.
ఆర్యవైశ్యులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల పట్ల ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అమరావతిలో 58 అడుగుల ఎత్తు గల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులపై తనకున్న అభిమానాన్ని చాటారని కొనియాడారు
తన నియోజకవర్గంలో కూడా ఆర్యవైశ్య సోదరులకు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆదరించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘం – ఐక్యతకు ప్రతీక“ఐక్యతే బలం… సేవే లక్ష్యం” అనే స్ఫూర్తితో ఆర్యవైశ్య సంఘం సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతోంది.మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, యువతకు మార్గనిర్దేశం చేయడం, విద్యార్థులను ప్రోత్సహించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యతను పెంపొందించడం సంఘం ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది.
ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములై, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం ఆర్యవైశ్యుల ప్రత్యేకత. పెద్దల అనుభవం, యువత ఉత్సాహం కలిసినప్పుడు సమాజం మరింత బలంగా ముందుకు సాగుతుంది.మన సంప్రదాయం మన గర్వం…
మన ఐక్యత మన బలం…మన సేవ మన బాధ్యత…ఆ ర్యవైశ్య సంఘం మనందరి వేదిక.“సమాజం కోసం కలిసి నడుద్దాం…
భవిష్యత్ తరాల కోసం మంచి మార్గం చూపుదాం.”

