చింతలపూడి, చింతలపూడి విజయహాసం ఎడిటర్ సత్యనారాయణ
:ఎత్తిపోతల పథకం లో భూ నిర్వాసితుల సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేయటానికి కృషి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు గౌ. శ్రీ నిమ్మల రామానాయుడు రైతులకు హామీ ఇచ్చారు.
శనివారం చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి నేతృత్వంలో ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల ప్రతినిధి బృందం పాలకొల్లు వెళ్లి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలసి రైతులకు జరిగిన ఇబ్బందులను నష్టపరిహారం విషయంలో చోటు చేస్తున్న లోపాలను భూసేకరణలో తీసుకున్న భూమి వివరాలు తమకు ఏ విధమైన పరిహారం చెల్లించకుండా రీ సర్వే అనంతరం ఇచ్చే ఈ పాస్ బుక్ లో విస్తీర్ణం మినహాయించి జారీ చేశారని మంత్రికి వివరించారు. దీనివల్ల రైతాంగం ఏ విధమైన భూమి అభివృద్ధి పంటలు సేద్యానికి, బ్యాంకు రుణాలు తీసుకునేందుకు అవకాశాన్ని కోల్పోయారని రైతాంగానికి తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో జరిగిన లోపాలను సవరించి రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అటకెక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని మరల తెరపైకి తీసుకువచ్చారని మెట్ట రైతులకు సాగనీరు అందించే ఈ పథకాన్ని తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి కృషి చేస్తున్నామన్నారు . కొన్ని సాంకేతిక లోపాల వల్ల జాప్యం జరుగుతుందని రైతులు సహకరిస్తే ముఖ్యమంత్రితో చర్చించి పథకాన్ని ముందుకు తీసుకువెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి శాసనసభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. రైతులకు అన్ని విధాల సహకరిస్తానని ధైర్యాన్ని ఇచ్చారు.
చింతలపూడి మండలంలోనిg వెంకటాపురం శెట్టి వారి గూడెం కాంతంపాలెం చింతలపూడి ఎర్రగుంటపల్లి గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు పాల్గొన్నారు

