Ticker

6/recent/ticker-posts

అగ్రి జెనటిక్స్ కంపెనీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులకునష్టపరిహారంవేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి, నార్లవరం గ్రామాలకు చెందిన మిర్చి రైతులు గత సంవత్సరం అగ్రి జెనటిక్స్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు సాగు చేసి నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకున్నారు.

 26/09/2026  చిగురుమామిడి, నార్లవరం  క్యాంపు కార్యాలయం విజయహాసం ఎడిటర్ సత్యనారాయణ :

అగ్రి జెనటిక్స్ కంపెనీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులకునష్టపరిహారంవేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి, నార్లవరం గ్రామాలకు చెందిన మిర్చి రైతులు గత సంవత్సరం అగ్రి జెనటిక్స్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు సాగు చేసి నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకున్నారు.

ఈ క్రమంలో 29 మంది రైతులకు చెందిన 47 ఎకరాల మిర్చి పంటకు సంబంధించి సుమారు రూ.14 లక్షల నష్టపరిహారాన్ని, కంపెనీ సహకారంతో శనివారం పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాధిత రైతులకు చెక్కుల రూపంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రైతులు నష్టపోయిన సమయంలో వారికి అండగా నిలిచి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి గంగాధరం, కూటమి నాయకులు మేచినేని సంజయ్, శివరాం, భాను తదితరులు పాల్గొన్నారు.