Ticker

6/recent/ticker-posts

పల్నాడు జిల్లా: విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చాల్సిన స్కూల్‌ బస్సుల భద్రతపై వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నారుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది పర్యవేక్షణ ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి

         


స్కూలు బస్సుల భద్రతపై మళ్లీ ప్రశ్నార్థకం

 చిన్నారుల భద్రతకు బాధ్యత ఎవరిది?????వరుస ఘటనలపై స్కూల్ బస్సుల తనిఖీలు ఎక్కడ???వరుస ప్రమాదాలతో భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన ముప్పాళ్ల ఘటన మరువకముందే రాజుపాలెం మండలం అనుపాలెంలో విషాదం

బస్సుల ఫిట్‌నెస్‌, భద్రతా ప్రమాణాలపై కఠిన తనిఖీలు చేపట్టాలని డిమాండ్‌

పల్నాడు జిల్లా: అమరావతి విజయసం పత్రిక ఎడిటర్ విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకెళ్లి, మరల ఇంటికి తిరిగి ఇళ్లకు చేర్చాల్సిన స్కూల్‌ బస్సుల భద్రతపై వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నారుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది పర్యవేక్షణ ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ముప్పాళ్ల మండలంలో స్కూల్‌ బస్సుకు సంబంధించిన ఘటన చోటుచేసుకోగా.. ఆ ఘటన మరువకముందే సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెంలో మరో విషాదం చోటుచేసుకుంది.

పిడుగురాళ్ల నుంచి అనుపాలెం వైపు వస్తున్న స్కూల్‌ బస్సు నుంచి కిందపడటంతో యక్కంటి జశ్విత (7) అనే బాలిక మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలు బాలిక బస్సు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిందా?