Ticker

6/recent/ticker-posts

రావులపాలెం, విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ అంగన్వాడి కార్యకర్తలను సత్కరించిన కూటమి నాయకులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ జన్మదినాన్నిఈతకోట గ్రామంలో నిర్వహించినఅంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గోని అంగన్వాడీ టీచర్లనుసత్కరించిన బీజేపీ. టీడీపీ.జనసేన నాయకులు

  రావులపాలెం, విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం  వివి సత్యనారాయణ :


అంగన్వాడి  కార్యకర్తలను సత్కరించిన కూటమి నాయకులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ జన్మదినాన్నిఈతకోట గ్రామంలో నిర్వహించినఅంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గోని అంగన్వాడీ టీచర్లనుసత్కరించిన బీజేపీ. టీడీపీ.జనసేన నాయకులు  పురస్కరించుకుని సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఎంపీపీ పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం నాడు కొత్తపేట ప్రాజెక్టు సీడిపిఓ గజలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమంలో ఎన్డియే కూటమి నాయకులు పాల్గోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.ప్రధాన మంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ టీచర్లను బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కలిసి దుస్వాలను కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ప్రధాని మోడీ 25సంవత్సరాల సేవా ప్రస్థానం 76వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అక్టోబర్ 17వరుకు సేవా సంకల్ప్ అభియాన్ జరుగుతున్నాయని ఆశీర్వాద దీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కో కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

బాలల భవిష్యత్తుకు బలమైన పునాది 

అంగన్వాడీ కేంద్రాలే మన సమాజానికి తొలి విద్యా వేదికలన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలోను రాష్టంలోను ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న మహోత్తరమైన పాలనే అందుకు నిదర్శనంమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్  కలయికతో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సంక్షేమానికి అభివృద్ధికి బాటలు వేసారన్నారు 

చిన్నారుల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తూ, వారి సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి అన్నారు 

అంగన్వాడీ ఉత్సవ్ సందర్భంగా

చిన్నారుల ఆనందం, ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి వారి అందిస్తున్న సేవలను కూటమి నాయకులు కొనియాడుతూ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జహంగీర్ సుల్తానా బేగం.

జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు యర్రంశెట్టి రాంమోహన్ రావు (రాము ),బీజేపీ నాయకులు పెన్మత్స నరసింహారాజు.మాజీ ఎంపీటీసి గండ్రోతు రాజు,టీడీపీ నాయకులు యర్రంశెట్టి నాగేశ్వరరావు(బుజ్జి), జనసేన యువ నాయకులు గండ్రోతు గౌతమ్,టీడీపీ నాయకులు సజ్జా వీరరాఘవులు. మహిళలు తదితరులు పాల్గొన్నారు.