అమరావతి విజయహాసం ఎడిటర్ఏ సత్యనారాయణ :ఏ
లూరు నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. పత్రిక ప్రకటన
ఏలూరు, సెప్టెంబర్, 26 : ఏలూరు నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. ఎం.జె. అభిషేక్ గౌడ నగరపాలక అధికారులను ఆదేశించారు. భారీవర్షాల అనంతరం ఏలూరు నగరంలో చాటపర్రు రోడ్డులోని బాలాజినగర్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో నగరంలో పారిశుద్ధ్య పనులను శనివారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ డ్రైన్లలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు నిల్వ ఉండడంతో , ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో రెండు రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని, ఏలూరు నగరంలో రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా, డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతీరోజు పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుండి చెత్త తొలగించే పనులు చేపట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరించాలన్నారు. దోమలు పెరగకుండా డ్రైన్లలో సిల్ట్ తొలగించాలని, పిచ్చి మొక్కలు, పొదలు తొలగించాలని, రోడ్డులపై ఎక్కడా చెత్త అనేది కనిపించకూడదన్నారు. తానూ తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడైనా అపారిశుద్ధ్య పరిస్థితులు కనిపెడితే సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.
*దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం* చాటపర్రు రోడ్ లోని బాలాజీనగర్ చిన్నపాటి వర్షానికే ముంపునకు గురై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కాలనీలోని పెద్ద డ్రైన్ లో మురుగునీరు, సిల్ట్ తొలగించడంతో భారీ వర్షాల కారణంగా కాలనీలోకి చేరిన వరద నీరు దిగువకు పూర్తిగా వెళ్ళిపోయింది. చాటపర్రు రోడ్ లోని బాలాజీనగర్ లో ఎన్నో సంవత్సరాల నుండి వేధిస్తున్న మురుగునీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆ ప్రాంతంలోని ప్రజలు జాయింట్ కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.


