Ticker

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విఆర్ఏ ల సంఘం పిలుపుమేరకు పెరవలి మండలం లో గ్రామ రెవెన్యూ సహాయకులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మె సహాయ నిరాకరణ ఉద్యమానికి ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి అరిగెల అరుణ కుమారి మరియు మండల అధ్యక్షులు బుద్ధన లక్ష్మణ రావు సంఘీభావం

పెరవల్లి మండలం,, విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం వి సత్యనారాయణ :



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విఆర్ఏ ల సంఘం పిలుపుమేరకు పెరవలి  మండలం లో గ్రామ రెవెన్యూ సహాయకులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మె సహాయ నిరాకరణ ఉద్యమానికి ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి అరిగెల అరుణ కుమారి మరియు మండల అధ్యక్షులు బుద్ధన లక్ష్మణ రావు సంఘీభావం తెలియచేసారు.అరుణ కుమారి మాట్లాడుతూ గ్రామస్థాయి లో వీఆర్ఏ లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.చాలీచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏ ల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.వీరి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కూటమి ప్రభుత్వం పరిష్కరించే వరకు వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలియచేసారు.పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని తెలిపారు 

                      ప్రధానడిమాండ్: 

 వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి,

 ప్రమోషన్స్ ఇవ్వాలి, నామినీ లను వీఆర్ఏలుగా గుర్తించాలి.పెరవలి  మండలం వీఆర్ఏ ల అధ్యక్షుడు సత్తిపండు కాపవరం రామకృష్ణ ఉపాధ్యక్షుడు కోశాధికారి ఖండవల్లి  రామకృష్ణ వీఆర్ఏలు పాల్గొన్నారు,