ఉయ్యూరు,అమరావతి విజయహాసం:
27.9.2026*RO మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్గారు*ఉయ్యూరు మున్సిపాలిటీలోని, సుందరమ్మపేటలో స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన *Blue Star 2TR Cooling Chiller RO మినరల్ వాటర్ ప్లాంట్* ను మాజీ శాసన మండలి శ్రీ *వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు* ఘనంగా ప్రారంభించారు.*ముందుగా RO ప్లాంట్ కాయిన్ బాక్స్ ను ప్రారంభించి, అనంతరం చిల్లర్ ప్లాంట్ నుండి వస్తున్న చల్లని మంచినీటిని పరిశీలించారు. ప్లాంట్ లో Lotus SS ట్యాంక్, అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు ద్వారా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించడం జరుగుతుందని తెలియజేశారు.* ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ..ప్రజలకు సురక్షితమైన మంచినీరుని అందించే ప్రక్రియలో భాగంగా వాటర్ ప్లాంట్ లు పెట్టడం శుభ పరిణామమని, 24 గంటలు అందుబాటులో ఉండేలా ఈ చిల్లర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకుడు జంపన వీర శ్రీనివాస్, నేరెళ్ల తేజ, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


