శ్రీనివాసపురం రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 29: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్డులో కాలేజీ సమీపం నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు ఉన్న రహదారి అభివృద్ధి పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు.
మున్సిపల్ జనరల్ ఫండ్స్ ద్వారా చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం నాయకులు, గౌరవ చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్
ఏలూరు పార్లమెంటరీ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని నాయకులు తెలిపారు.వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ రోడ్డు నిర్మాణంతో పరిష్కారం లభించనుందని, రహదారి పూర్తయిన అనంతరం రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్ కోనేటి చంటి జనసేన నాయకులు జెడ్పిటిసి పోల్నాటి బాబ్జి, రాష్ట్ర క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్ర రాజు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామకుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, తూటుకుంట రాము, చెను ప్రసాద్, శీలం రాంబాబు.. మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొనడం జరిగినది


