Ticker

6/recent/ticker-posts

యార్లగడ్డ మార్గదర్శకత్వంలో గన్నవరం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*


గన్నవరం నియోజకవర్గం – కృష్ణా జిల్లా
 రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో గన్నవరం MPDO కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించబడ్డాయి.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 17 అవగాహన స్టాళ్లు ఏర్పాటు చేసి మహిళల సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలపై సమాచారం అందించారు. మహిళా సాధికారత సందేశాన్ని విస్తరించేందుకు సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మహిళా వ్యాపారవేత్తలు, మహిళా నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు మరియు P4 మహిళా మార్గదర్శులను సత్కరించారు. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనగా సుమారు 500 మంది హాజరయ్యారు.
అలాగే *ముఖ్యమంత్రి పాల్గొన్న రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రదర్శించారు*.
అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ అధికారి షాహిద్ బాబు, సిడిపిఓ మంగమ్మ, డిప్యూటీ తాసిల్దార్ నాంచారమ్మ, గన్నవరం ఎస్సై ప్రశాంతి, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, రాష్ట్ర తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, జిల్లా టీడీపీ కమిటీ సభ్యులు పొదిలి లలిత, కంభంపాటి లక్ష్మీనరసమ్మ, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కానూరు శేషుమాధవి, బెజ్జవరపు సూర్యకుమారి, బొమ్మసాని అరుణ, జాస్తి రేణుక, గుడ్డేటి సుమతి మరియు స్వచంద సేవ సంస్థల మహిళలు పాల్గొన్నారు