ఏలూరు, సెప్టెంబర్, 12 : ఏలూరు: అమరావతి విజయ హాసం ఎడిటర్ ఎం వి సత్యనారాయణ, ఏలూరు జిల్లాలోని 155 మద్యం పాపుల రెన్యూవల్ కి 2026-27 సంవత్సరానికి గాను రెన్యూవల్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా మద్యనిషేద ఆబ్కారీ అధికారి ఏ . ఆవులయ్యా ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల యజమానులు మద్యం షాపులను ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఈ 155 పాపుల్లో 141 ఓపెన్ కేటగిరి షాప్స్ అదేవిధంగా 14 షాపులు రిజర్వ్ కేటగిరి లో గీత కులానికి గతంలో మంజూరు చేసిన వాటిలో ఉన్నాయన్నారు. వాటిలో 50000 వరకు జనాభా గల వైన్ షాప్ లకి 60.50 లక్షలు, 50000 పైబడి 5 లక్షల జనాభా గల షాప్ కి 71.50 లక్షలు మరియు రిజర్వ్ కేటగిరి షాప్ లకి 30.30 లక్షలు, 35.80 లక్షలు గా జనాభా ప్రాదిపదికన కార్పొరేషన్, మునిసిపాలిటి, నగర పంచాయతి, మండలం వారిగా వార్షిక పీజుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా రెన్యువల్ చేసుకోవడానికి అంటే రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పీజు ను ప్రభుత్వం 38% గా అనగా 71.50 లక్షల పాప్ 27.20 లక్షలు, 60.50 లక్షల షాపునకు 23 లక్షలు అదేవిధంగా గీత కులాల షాప్ కు 13.60 లక్షలు, 11.50 లక్షలు నిర్ణయించడం జరిగిందన్నారు. . ఈ రెన్యువల్ రిటైల్ ఎక్సయిజ్ ఫీజు ఒకే మొత్తంగా రెన్యూవల్ అప్లికేషన్ తో చెల్లించాల్సి ఉంటుందన్నారు. . అదేవిధంగా పర్మిట్ రూమ్ ప్రతీ షాప్ నకు తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. . ఈసారి పర్మిట్ రూమ్ పీజు 7.50 లక్షలు, 5.00 లక్షలు గా నిర్ణయించడం జరిగిందని, లేదా సదరు మొత్తమును మూడు వాయిదాలలో అనగా సెప్టెంబర్, జనవరి, మే నెలలలో అదేవిధంగా వార్షిక రిటైల్ ఎక్సైట్ ఫీజు నాలుగు వాయిదాలలో అనగా సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్, జూన్ నెలలలో చేల్లిపునకు పెసులుబాబు ప్రభుత్వం కల్పించడం బరిగిందన్నారు. అదే విదంగా రెన్యువల్ ప్రాసెసింగ్ ఫీజు 5000/- ప్రతి లైసెన్స్ దారుడు చెల్లించాలన్నారు. ఈ 2026-27 సంవత్సరానికి మొత్తం గా 153.23 కోట్ల ఆదాయం ప్రభుత్వమునకు చేకూరుతుందన్నారు. . లైసెన్స్ దారులు షాపును రెన్యువల్ చేసుకోకపోతే తిరిగి అటువంటి షాపులకు లాటరీ నిర్వహించబడుతుందన్నారు. ఈ లాటర్ నందు ప్రతీ షాపునకు తప్పనిసరిగా నాలుగు అప్లికేషన్ రావలిసి ఉంటుందని, లైసెన్స్ దారులు అందరు తమ షాపులను రెన్యువల్ చేసుకొనుటకు గడువు ది.21.09.2026 సాయంత్రం 5.00 గ.ల. తో ముగియనుందన్నారు. లైసెన్సీ లు 2024-26 సంవత్సరానికి గాను ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పాత బకాయిలు ఉదాహరణకు పర్మిట్ రూమ్ సంబంధించి రుసుములు, లైసెన్స్ పీజు బకాయిలు ఉంటే అనర్హులుగా ప్రకటించి లైసెన్స్ రెన్యువల్ చేయబడదని చెప్పారు., కావున అందరూ ఈ విషయం గమనించి ఎటువంటి బకాయిలు లేకుండా చూసుకోవాలని ఆవులయ్యా తెలియజేసారు.
-----------------------------------------------------------

