Ticker

6/recent/ticker-posts

ప్రకృతి వ్యవసాయంలో సాగు విధానాన్ని ఇండోనేషియా కి చెందిన ఆస్టుంగ్‌కారా వే ఆర్గనైజేషన్ నుండి 9 మంది సభ్యులు, బోర్డర్‌లెస్ ఫౌండేషన్ (థాయిలాండ్) నుండి 2 మంది సభ్యుల బృందం సోమవారం జిల్లాలోని ద్వారకా తిరుమల మండలము గుండుగొలను గుంట గ్రామం లో పరిశీలించారు.




          ద్వారకా తిరుమల / ఏలూరు, సెప్టెంబర్, 28 : విజయ హాసం పత్రి క సత్యనారాయణ  ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు  విధానాన్ని  ఇండోనేషియా కి చెందిన ఆస్టుంగ్‌కారా వే ఆర్గనైజేషన్ నుండి 9 మంది సభ్యులు, బోర్డర్‌లెస్ ఫౌండేషన్ (థాయిలాండ్) నుండి 2 మంది  సభ్యుల బృందం  సోమవారం  జిల్లాలోని ద్వారకా తిరుమల మండలము గుండుగొలను గుంట గ్రామం లో పరిశీలించారు.  ఈ బృందాలు జిల్లాలో ఈనెల 30వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలిస్తారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్  . బి.వెంకటేష్   ప్రకృతి వ్యవసాయం అమలు చేయడానికి కావలసిన 9 సార్వత్రిక సూత్రాలను బృంద సభ్యులకు వివరించారు.  

        అనంతరం గుండుగొలను గుంట గ్రామంలో ఓ.గోపాలకృష్ణ చే నిర్వహించబడుతున్న శ్రీ సుబ్రహ్మన్యేశ్వర బయో రిసోర్స్ సెంటర్ ను సందర్శించారు.. ఆ సెంటరు నిర్వహించబడుతున్న విధానము, ఆవశ్యకత, అవసరము తెలియజేసిన తరువాత వివిధ పంటలకు పురుగు, తెగుళ్ళు ను నివారించడానికి తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు , వాటికి కావలసిన కషాయాలైన అగ్నాస్త్రము,వేపగింగల కషాయము, జీవ ఉత్ప్రేరకాలైన జీవామ్రుతము, ఘన జీవామ్రుతము, గ్రోత్ ప్రోమోటర్స్ కోడిగుడ్డు- నిమ్మరసం ద్రావణం , విత్తన గుళికలు తయారు విధానాన్ని గోపాలకృష్ణ బృందం సబ్యులకు తెలియజేసారు .  అక్కడనే వివిధ రకాల కూరగాయలు, పండ్లమోక్కలతో ఉన్న ATM మోడలును సభ్యులు సందర్శించారు. అనంతరం.  రైతు సాధికార సంస్థ తరపున  అకాడమి లో  నిర్వహించబడుతున్న రైతు శాస్త్రవేత్త కోర్స్ చదువుతున్న FS లు మెంటార్ లతో కోర్స్ గురించి . మరియు ప్రకృతి వ్యవసాయ విభాగములో పనిచేస్తున్న వివిధ స్థాయి ల యొక్కవివరములు, వారి పని విధానము గురించి సభ్యులు అడిగి తెలుసుకున్నారు.  తదుపరి మహిళా సంఘాల సభ్యులతో ప్రకృతి వ్యవసాయంలో వారి పాత్ర , రైతులతో ఎ విధముగా కలసి పనిచేస్తున్నారు, పెరటి తోటలగురించి వివరాలు, ప్రకృతి వ్యవసాయం లో పండించిన ఆహార ఉత్పత్తులను వినియోగించే విధానము, ఆరోగ్యము , పోషణ, పుస్తకనిర్వాహణ మొదలగు అంశాలను ప్రతినిధి బృందానికి వివరించుట జరిగినది. 

          అనంతరం తర్వాత జంగా గణేష్ నిర్వహించుచున్న వివిధ రకాలైన పంటలతో  కొబ్బరి, వక్క, కోకో , పసుపు, దుంప జాతులతో ఉన్న ఉద్యానవన పంట పొలాన్ని సందించడం జరిగింది మరియు ఒకే పొలములో వివిధ రకాలైన తోట పంటలవలన కలిగే ప్రయ్యోజనాలు, లాభాలు వారికి తెలియజేసారు.   బృందం సభ్యులు  ఎక్కడికక్కడ వారి సందేహాలు నివృత్తి చేసుకొని ,  ఏలూరు జిల్లలో ప్రకృతి వ్యవసాయం అమలు విధానంను అభినందించారు. 

         ఈ కార్యక్రములో ప్రతినిధి బృందంతో పాటు   అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ . షేక్ .మహబూబ్ వలి   DPP సత్య,  ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు ఓ.గోపాల కృష్ణ, జంగా గణేష్ మొదలగు వారు పాల్గొన్నారు.

బృంద సభ్యులు 

• కెనడా: తిమోతీ జోసెఫ్ ఫిజాల్ (Timothy Joseph Fijal)

• దక్షిణాఫ్రికా: షానన్ లీ గ్రీఫ్ (Shanon Leigh Greef)

• ఇండోనేషియా:

o సోఫియా యోహానా (Sophia Yohana)

o ఐ గుస్తీ న్గురా ప్రభూ వీర (I Gusti Ngurah Prabu Wira)

o అల్వాన్ విజయ కుసుమ (Alwan Wijaya Kusuma)

o నినా హార్నిదియా (Nina Hernidiah)

o నధిఫ్ అల్వాన్ కమిల్ (Nadhif Alwan Kamil)

o ని కేతుత్ విద్యా అస్తుతి (Ni Ketut Widya Astuti)

• ఆస్ట్రేలియా: క్రెయిగ్ ఆండ్రూ ఎల్లిస్ (Craig Andrew Ellis)

• జపాన్: యాగిషితా టోమోనోబు (Yagishita Tomonobu)

• మాయన్మార్ (బర్మా): ఆంగ్ ఫ్యో ఓ (Aung Phyo O