ఏలూరు, సెప్టెంబర్, 29 : ఏలూరు, అమరావతి విజయహాసం పత్రిక ఎడిటర్ ఎం వి వి సత్యనారాయణ : జిల్లాలో రెవిన్యూ సమస్యలకు సంబంధించి పిజిఆర్ఎస్ ద్వారా అందిన 22 వేల 513 ధరఖాస్తులలో 19 వేల 472 అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. 22ఏ భూ సమస్యల పరిష్కారం, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం,, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ సమస్యలు, రీ సర్వే రెవిన్యూ రికార్డుల డిజిటైజేషన్ ,అటవీ భూముల వివరాలు వెబ్ ల్యాండ్ లో నమోదు, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులపై ధరఖాస్తుదారుని కలిసి సమస్య తెలుసుకుని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 22ఏ భూ సమస్యలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా నిబంధనల ననుసరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను నిర్దేశించిన లక్ష్యాల మేర పూర్తిచేయాలన్నారు. అక్టోబర్ నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ధరఖాస్తుదారుని కలిసి సమస్య తెలుసుకుని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏలూరు జిల్లాలో జూన్ 15 వ తేదీ నుండి సెప్టెంబర్, 28వ తేదీ వరకు 22ఏ భూ సమస్యలపై 491 దరఖాస్తులు అందగా వాటిలో 211 దరఖాస్తులు పరిష్కరించామని, నిబంధనల మేరకు లేని 208 దరఖాస్తులను కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు. జిల్లాలో రీ సర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేస్తామన్నారు. సెప్టెంబర్ నెలలో జిల్లాలోని 13 వేల 131 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేశామనన్నారు. రెవిన్యూ రికార్డుల డిజిటైజేషన్ కు 4367 అంశాలకు 7సంబందించిన లక్షల 34 వేల 612 రికార్డులు, రెండవ విడతలో 2808 అంశాలకు సంబందించిన 6 లక్షల 51 వేల 158 రికార్డులు డిజిటైజేషన్ కు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలియజేసారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ ఏం. ముక్కంటి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.

