Ticker

6/recent/ticker-posts

హనుమాన్ జంక్షన్‌లో వినాయక విగ్రహ ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు*


 



హనుమాన్ జంక్షన్‌లో వినాయక విగ్రహ ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు

హనుమాన్ జంక్షన్ : గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో శుక్రవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన సతీమణి జ్ఞానేశ్వరి తో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్‌లో శ్రీ వరసిద్ధి వినాయక గణపతి దేవాలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వరసిద్ధి గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. 

అనంతరం హనుమాన్ జంక్షన్ – నూజివీడు రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో నిన్నటి నుండి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేడు ఉదయం 6 గంటల నుంచే సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం చతుస్థానార్చనలు, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ సూక్త హోమం నిర్వహించగా, మహిళల ఆధ్వర్యంలో సామూహిక సహస్ర కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. సాయంత్రం దైవిక రాయబారోత్సవం, మంగళాశాసనం వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో అట్లూరి శ్రీనివాసరావు, చలమలశెట్టి రమేష్, మూల్పురి సాయి కళ్యాణి, ఆళ్ల గోపాలకృష్ణ, వేములపల్లి శ్రీనివాసరావు, వేగిరెడ్డి పాపారావు, వడ్డిల్లి లక్ష్మీ, చింతల వెంకట అప్పారావు, మొవ్వ వేణుగోపాల్, చలసాని శ్రీనివాసరావు, యలమంచిలి మూర్తి, నందిగం స్వామి, ఎస్. కే సాంబశివరావు, తవ్వా పూర్ణచంద్రరావు, దుట్టా శివన్నారాయణ, అరుమళ్ళ కృష్ణారెడ్డి, తాడిశెట్టి శ్రీను, కడవకొల్లు రాజేష్, అవిర్నేని భవాని శంకర్, కొల్లూరు చంద్రకాంత్, వలివేటి కిషోర్, లింగం శ్రీధర్, ఆర్నేపల్లి సూరిబాబు, గరికపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.