Ticker

6/recent/ticker-posts

జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, తదితరుల నుండి జిఎస్జి వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.



       




 ఏలూరు,ఏప్రిల్, 10 :    జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, తదితరుల నుండి జిఎస్జి వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నుండి జిఎస్టి వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు తో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ నుండి శుక్రవారం  కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ   జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 220 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆర్ డబ్ల్యూఎస్,, రహదారులు భవనాలు శాఖ, ఇరిగేషన్, గృహ నిర్మాణం , తదితర శాఖల ద్వారా  నిర్మాణ పనులు చేపడుతూ  సదరు కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అందిస్తున్నామని, సదరు చెల్లింపులకు సంబంధించి జిఎస్టి పన్నుల వసూలు చేసేందుకు సంబంధిత పనుల నిధుల చెల్లింపుల వివరాలను వాణిజ్యపన్నుల శాఖల అధికారులకు వెంటనే సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుండి జిఎస్టి వసూళ్లకు సంబంధించి వివరాలను వాణిజ్య పన్నుల శాఖాధికారులకు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

            జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ, వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు, ఇరిగేషన్పం, చాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ.ఎస్., ఆర్ అండ్ బి, ,  ఎస్ఈ లు దేవప్రకాష్, రమేష్, త్రినాధ్ బాబు, రాజా రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు