Ticker

6/recent/ticker-posts

సాయంత్రం 4.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) శ్రీమతి పి. జగదాంబ గారి సమక్షంలో జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని విభాగాల పరిపాలన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


 

ఏలూరు,సాయంత్రం 4.00 గంటలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (CEO) శ్రీమతి పి. జగదాంబ గారి సమక్షంలో జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని విభాగాల పరిపాలన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌కు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్‌లో గడువు ముగిసిన షాపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) విభాగంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విభాగాల వారీగా పెండింగ్ అంశాలను సమీక్షించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన గడువులు నిర్ణయించారు.

జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చైర్‌పర్సన్ గారు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ CEO శ్రీమతి పి. జగదాంబ, డిప్యుటీ సీఈఓ శ్రీ కె.భీమేశ్వర్ అన్ని విభాగాల పరిపాలన అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.