Ticker

6/recent/ticker-posts

వామ్మో.. క్రీమ్ రోల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. తినడానికే భయపడతారేమో..


SPECLAL: చాలా మంది బేకరీ ఫుడ్స్‌ను బాగా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలైతే మరింత ఎక్కువగా ఇష్టపడతారు. బేకరీల్లో దొరికే క్రీమ్ రోల్స్‌ చాలా మంది చిన్న పిల్లలు ఇష్టపడే ఫేవరెట్ స్నాక్. అయితే ఆ క్రీమ్ రోల్స్‌ను తయారు చేస్తున్న విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇకపై క్రీమ్ రోల్స్ తినడానికి కాస్త ఆలోచించకతప్పదు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


@ChapraZila అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రోల్‌లో క్రీమ్ నింపుతున్నాడు. ఆ రోల్ తయారు చేస్తున్న ప్రాంతం చాలా మురికిగా ఉంది. ఎటువంటి పారిశుధ్యం లేదు. ఆ వ్యక్తి రోల్ తీసుకుంటున్న ట్రే కూడా అపరిశుభ్రంగా ఉంది. అలాగే క్రీమ్‌ను నింపుతున్న యంత్రం కూడా మురికిగా ఉంది. ఆ వ్యక్తి తన చేతితోనే రోల్స్‌లో క్రీమ్ నింపుతున్నాడు. క్రీమ్ నింపిన రోల్స్‌ను నేలపై పరిచిన ఓ షీట్‌పై వేస్తున్నాడు.