Ticker

6/recent/ticker-posts

మహిళా దినోత్సవం సందర్భంగా పరిపూర్ణ బాలల ఆశ్రమంలో అన్నదానం*



ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్లమోతు రష్మిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరువూరు పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డులో ఉన్న పరిపూర్ణ బాలల ఆశ్రమంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.*

*ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను సాధిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమాజంలో బాలికలపై జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని, మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని ఆమె సూచించారు.*

*అనంతరం ఆశ్రమంలోని బాలికలందరికీ స్వీట్లు పంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పరిపూర్ణ ఆశ్రమంలోని చిన్నారులు కూడా రష్మికకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమకు అన్నదానం నిర్వహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో రష్మిక తండ్రిగారు, పరిపూర్ణ బాలల ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు (అభి), వరలక్ష్మి గార్లు పాల్గొన్నారు.*