*ఏలూరులో రూ. 2. 73 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీసుస్టేషన్ భవనంను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ...*
*ప్రజల రక్షణలో వినూత్న కార్యక్రమాల అమలు చేస్తున్న జిల్లా ఎస్పీ ని అభినందించిన హోమ్ మంత్రి*
*రాష్ట్ర హోంమంత్రితో పాటు ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏలూరు రేంజీ ఐజి జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ లు పాల్గొన్నారు*
ఏలూరు, ఏప్రియల్ 09: మహిళలకు భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ, భవిషత్తు అవసరాలకు అనుగుణంగా ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంనకు అతి సమీపములో నిర్మించిన నూతన మహిళా పోలీసు స్టేషను భవనాన్ని గురువారం రాష్ట్రహోం శాఖా మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత లాంఛనంగా ప్రారంభించారు.
సుమారు 30 సెంట్ల విస్తీర్ణంలో రూ 2 కోట్ల 73 లక్షలు రూపాయలు భారీ వ్యయంతో అన్ని రకాలు హంగులతో ఈ రెండంతస్తులు భవనాన్ని నిర్మించారు.
భవనములో శిశు సంరక్షణ కేంద్రం స్టేషనుకు వచ్చే మహిళలతో పాటు వారి చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 'చిల్డ్రన్స్ ప్లే ఏరియా' మరియు అవసరమైన సదుపాయాలను కల్పించడం ఈ భవనం యొక్క ప్రత్యేకత.
ఆధునిక వసతులు మహిళా మరియు పురుష సిబ్బంది కోసం విడివిడిగా అత్యాధునిక బేరక్ .
విశాలమైన కాన్ఫరెన్స్ హాలు మరియు సమావేశ మందిరాలు. సురక్షితమైన లాకప్ గదులు మరియు సందర్శకులు కోసం వెయిటింగు హాలు. సాంకేతికత భావితరాలు అవసరాలకు తగ్గట్టుగా పూర్తిస్థాయీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా నెట్‌వర్కింగు మరియు డిజిటల్ సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హోం శాఖా మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ రోజు పెదపాడు పోలీస్ స్టేషన్ ను ప్రారంభించామని, ముందుగా నిర్వహించిన పోలీసు స్టేషను యొక్క స్థితి గతులను చూసి తాను ఎంతో ఆవేదన చెందానని, అటువంటి వసతులు లేనటువంటి ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసినటు వంటి ఆ పోలీసు స్టేషను అధికారులను, సిబ్బందిని అభినందించానని అన్నారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడమే ప్రధాన కర్తవ్యంమని అన్నారు. మహిళలకు ఏదైనా కష్టం సంభవించిన యెడల పుట్టింటికి వెళ్ళి ఏ విధముగా వారి యొక్క సమస్యలను తెలియ చేసుకుంటారో అదే విధమైనటు వంటి అదే విధముగా మహిళా పోలీసు స్టేషనుకి మహిళలు వచ్చి వారి బాధలను తెలియ చేసుకుని వారి సమస్యలు పరిష్కారంతో సంతోషంతో ఇంటికి వెళ్లేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటారన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి పోలీసుభవనాలు సేవలు నాణ్యతను మరింత పెంచుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు లో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అభయ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేశారని, ఈ బాక్స్ లో మహిళలు తమ ఫిర్యాదులను ఒక కాగితంపై రాసి వేయవచ్చన్నారు. నిరక్షరాస్యులు తమ సమస్యను తమ వాయిస్ ద్వారా తెలియజేస్తే, ఫిర్యాదు గా టైప్ అయి ఆన్లైన్ ద్వారా సదరు పోలీస్ స్టేషన్ కు వెళుతుందన్నారు. ప్రజలకు మెరుగైన రక్షణ చర్యలు తీసుకోవడంలో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ను హోమ్ మంత్రి అభినందించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించడంలో ఏలూరు జిల్లా ఎస్పీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నోసార్లు ప్రశంసించారని, రానున్న కాలంలో మెరుగైన సేవలను అందించుటలో ఏలూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదని అన్నారు. ఏలూరు జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏలూరు జిల్లాని ఎంపిక చేయడం జరిగిందని, నేర నియంత్రణ కొరకు ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. విద్యాధికులే ఎక్కువగా సైబర్ నేరాలకు గురవుతున్నారని, సైబర్ నేరాలపై కూడా ప్రజలకు విస్తృతమైన అవగాహన కలిగించాలన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా తయారు చేయబడిన షీ బాక్స్ ను ప్రారంభించిన ఈ సందర్భంగా షి బాక్స్ ను గురించి తెలియ జేస్తూ పోలీసు స్టేషను వరకు వచ్చివారి యొక్క సమస్యలను తెలియ జేసుకోలేనటువంటి మహిళలు కొరకు ధర్మాయాఫ్ న్యాయ సహాయకు ద్వారా వారి యొక్క సమస్యను ఈ షీ బాక్స్ వద్ద వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే సంబంధిత అధికారులు సదరు రిపోర్టును తన అంతట తానుగా రూపొందించి సంబంధిత అధికారులకు తెలియ జేయడం జరుగుతుందని తెలిపారు.
నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత పోలీసులు పనితీరును అభినందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్ రోడ్డు పార్కును మంత్రివర్యులు సందర్శించి, సదరు పార్కులో విద్యార్థిని, విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయించిన జిల్లా ఎస్పీ ని మంత్రివర్యులు అభినందించినారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ -2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎస్పిలు జి.మునిరాజు, ఆర్.సుష్మిత, ట్రైనీ ఐపియస్ జయాశర్మ, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, మహిళా పోలీసు స్టేషను డీఎస్పీ యు. రవిచంద్ర, వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

