ఏలూరు జిల్లాలో పిజిఆర్ ఎస్ ద్వారా అందిన అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మికి చెప్పారు.
March 31, 2026
ఏలూరు, మార్చి , 31 : ఏలూరు జిల్లాలో పిజిఆర్ ఎస్ ద్వారా అందిన అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మికి చెప్పారు. రాష్ట్రంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారం, పిజిఆర్ ఎస్ అర్జీల పరిష్కారం, రీ సర్వే, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి, తదితర అంశాలపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓ లు, ఆర్డీఓ లతో రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామాలను ఎంపిక చేసుకుని భూమి వివరాలు సవరణ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రీ సర్వే అనంతరం సవరించిన భూమీ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి ఎటువంటి తప్పులు లేకుండా క్యూ ఆర్ కోడ్, రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. పిజిఆర్ ఎస్ ద్వారా అందిన అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏ భూ సమస్యలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ భాస్కర్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు పాల్గొన్నారు.