ఏలూరు, మార్చి ,31 : అమరావతి విజయ హాసం :
రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు సాదించాలి*
*కౌలు రైతులకు నిర్దేశించిన మేర రుణాలు అందించాలి*
*పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పధకంలో 10 వేల యూనిట్లకు రుణాలు అందించాలి
*బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణా ప్రణాళిక లక్ష్యాల సాధనపై అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష*
జిల్లాలో వార్షిక రుణ ప్రణాళికను ననుసరించి ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 2025- 26 వార్షిక రుణ ప్రణాళిక అమలులో నిర్దేశించిన లక్ష్యాల సాధనపై అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యతా రంగాలలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు పంట రుణాలుగా 13 వేల 965 కోట్ల రూపాయలు రుణ లక్ష్యాలను సాధించారని, అదేసమయంలో ప్రాధాన్యతా రంగాలలో 48. 17 శాతం మాత్రమే లక్ష్యసాధనపై కలెక్టర్ స్పందిస్తూ ప్రాధాన్యతా రంగాలలో నూరుశాతం లక్ష్యసాధన జరిగేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు 2025 2025 ఖరీఫ్, రబీ కాలానికి 375 కోట్ల రూపాయలు రుణాలు అందించాల్సి ఉండగా 124 కోట్ల రూపాయలు మాత్రమే అందించారన్నారు. ఎంఎస్ఎంఈ లక్ష్యాలలో 65. 84 శాతం మాత్రమే లక్ష్య సాధన చేశారన్నారు. కౌలు రైతులకు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు కూడా నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు సాధించేలా బ్యాంకర్లతో సమన్వయము చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 13 వేల 659 స్వయం సహాయక సంఘాలకు 1364. 34 కోట్ల రూపాయలు రుణాలుగా అందించారన్నారు. పట్టణ ప్రాంతాలలోని 2050 స్వయం సహాయక సంఘాలకు 242. 34 కోట్ల రూపాయలు రుణాలుగా అందించారన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పధకంలో 5620 దరఖాస్తులు మాత్రమే మంజూరు చేయడంపై కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల యూనిట్లు ఏర్పాటుచేయాలని లక్ష్యాలను నిర్దేశించిందని, లక్ష్యాలు సాధించే దిశగా బ్యాంకర్ల వద్ద పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. జిలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు 219 దరఖాస్తులు అందగా, 31 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, 22 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి కారణాలు తెలుసుకుని, పరిష్కరించదగిన అంశాలు ఉంటె పరిశీలించాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. చిన్న వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన పిఎం స్వనిది పధకంలో 1325 దరఖాస్తులు బ్యాంకర్ల వద్ద పెండింగ్ ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు రుణాలు అందించాలన్నారు. పిఎంఈజిపి పెండింగ్ లో ఉన్న 44 దరఖాస్తులు, పిఎం విశ్వకర్మ పధకంలో పెండింగ్ లో ఉన్న 166 దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఎంతో అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పాడి పశువులకు రుణాలు అందించే సమయంలో పశువుల భీమా పథకాలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు.
సమావేశంలో యూనియన్ బ్యాంకు డిప్యూటీ రీజినల్ హెడ్ సత్యనారాయణ రెడ్డి, ,ఆర్బీఐ ELDU డి. ఎలమంద, నాబార్డ్ ఏజీఎం అనిల్ కాంత్, ఎల్డిఎం నీలాద్రి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష, ఉద్యానవనాలు శాఖాధికారి సాజా నాయక్, బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత, డిఆర్డిఏ ఏపిఎం భూషణం, మెప్మా పీడీ ఎం. రాజబాబు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా 2026-27 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్లెట్ ను కలెక్టర్ విడుదల చేశారు.

