కొవ్వూరు మార్చి, అమరావతి విజయ హాసం : ఆర్డీవోగా ఆనందరావు బాధ్యతలు...రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో నియామకం...అధికారులు, ప్రజాప్రతినిధులఅభినందనలు... కొవ్వూరు మార్చి
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా కాకర ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన ఈ పదవికి నియమితులయ్యారు. ఇదే పదవిలో తొలి నియామకం కావడం విశేషం
గోపాలపట్నంకు చెందిన ఆనందరావు బి.కాం, ఎం.ఏ., పీహెచ్‌డీ విద్యార్హతలు కలిగి ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) అమరావతిలో ఎస్డీసీగా విధులు నిర్వహించారు.
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఆర్.టి నెం.471, తేదీ 24-02-2026 ప్రకారం ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆనందరావుకు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

