కైకలూరు, అమరావతి విజయహాసం : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు మండలం ఆలపాడు గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారి ఆర్ధిక సహకారం 1.97 కోట్లు రూపాయిలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మరియు పాఠశాల యాజమాన్యం వారు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలో అదనపు తరగతుల భవనం, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగు నీరు అందించే విధంగా RO వాటర్ ప్లాంట్, కళామండపం, ఆధునిక డైనింగ్ హల్ తో కిచెన్, పాఠశాలలో అంతర్గత సీసీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. MLA కామినేని గారు మాట్లాడుతు ముందుగా SBI వారిని అభినందించారు. ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4ను స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం రంఘమైన SBI బ్యాంకు ఇలా విద్యార్థుల భవిష్యత్తు కొరకు మౌలిక సదుపాయాలు నిర్మించటం చాలా సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

