Ticker

6/recent/ticker-posts

పి4 పథకంలో భాగంగాహనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్‌లో ఆర్వో ప్లాంట్, వాటర్ ట్యాంకర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ*





హనుమాన్ జంక్షన్: *పి4 పథకంలో భాగంగాహనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్‌లో ఆర్వో ప్లాంట్, వాటర్ ట్యాంకర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ*

P4 పథకంలో భాగంగా హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్‌లో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్, అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రారంభించారు. అనంతరం బాపులపాడు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు అట్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హనుమాన్ జంక్షన్ వంటి రద్దీగా ఉండే బస్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం శుభ్రమైన తాగునీరు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా రోజూ బస్సు ప్రయాణికులు, స్థానిక ప్రజలు సురక్షితమైన తాగునీటిని సులభంగా పొందగలరని తెలిపారు. సేవా భావంతో ప్రజల కోసం ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులు అందించడంలో ప్రభుత్వం, సేవా సంస్థలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షాహిద్ బాబు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, గన్నవరం ఏఏంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, స్రవంతి చారిటబుల్ ట్రస్టు అధినేత వీరమాచనేని సత్యప్రసాద్ దంపతులు, ఆళ్ల గోపాల కృష్ణ, అట్లూరి శ్రీనివాసరావు, చిన్నాల లక్ష్మీనారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, ఆర్నేపల్లి సూరిబాబు, మొవ్వ వేణుగోపాల్, యంగ్ ప్రొఫినల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.