Ticker

6/recent/ticker-posts

రాష్ట్రమంతా వర్షపు నీటి సంరక్షణకు 100 రోజులు కార్యాచరణ ప్రణాళికలు అమలకు శ్రీకారం*. *ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భూగర్భ జలాలు స్థాయిని పెంచే బాధ్యత మనందరిపై ఉంది*. *"నీటి భద్రత – సాగునీటి సంఘాలు బాధ్యత" కార్యక్రమానికి శ్రీకారం*. *రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* ...






 *రాష్ట్రమంతా వర్షపు నీటి సంరక్షణకు 100 రోజులు కార్యాచరణ ప్రణాళికలు అమలకు శ్రీకారం**ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భూగర్భ జలాలు స్థాయిని పెంచే బాధ్యత మనందరిపై ఉంది*.*"నీటి భద్రత – సాగునీటి సంఘాలు బాధ్యత"  కార్యక్రమానికి శ్రీకారం*.*రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* ... 

ఏలూరు/నూజివీడు, ఏప్రియల్ 06: నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు వద్ద సోమవారం “నీటి భద్రత – సాగునీటి సంఘాలు బాధ్యత” కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూగర్భ జలాలు మట్టాన్ని పెంపొందించడం, నీటి వనరులు సంరక్షణ, సాగునీటి వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం దృష్ట్యా ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని  లాంఛనంగా ప్రారంభించారు.అధికారులకు, సాగునీటి సంఘాలు అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు సంఘ నాయకులు, రైతులతో సుదీర్ఘంగా సమీక్షించి మంత్రి కొలుసు పార్థసారథి పలుసూచనలు జారీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను సంరక్షించడం భూగర్భ జలాలు స్థాయిని పెంచడం మనందరి బాధ్యత అన్నారు.నీటి వృథాను నివారించడం సమర్థ వంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.నూజివీడు నియోజకవర్గం 4 మండలాలో యంఐ ట్యాంకులు 68, పంచాయతీరాజ్ ట్యాంకులు 300 ఉన్నాయని తెలిపారు. కెపాసిటీ ఇన్ యంసియఫ్టి 4,117.852 , రిజిస్ట్రేషన్ ఆయకట్టు 25,947.09 ఎకరాలు ఉందని తెలిపారు.ఈ క్రమంలో ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు 100 రోజులు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని సాగునీటి కాలువలు, చెరువులు, జలాశయాలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సాగునీటి కాలువలు, చెరువులు గట్లను బలోపేతం చేయడం, కాలువల పూడికతీత,  లాక్స్ మరమ్మతులు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనుల్లో ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే పనులు వేగవంతంగా, నాణ్యతగా జరుగుతాయని అన్నారు. జలవనరులు శాఖ, అటవీ శాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలు, డ్వామా తదితర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6–15 పనులు గుర్తింపు, కాలువల శుభ్రపరచడం, పూడికతీత పనులు జరుగుతాయని అన్నారు. ఏప్రిల్ 16–20 పరిపాలనా అనుమతులు, ఏప్రిల్ 21–జూలై 9 పనుల అమలు జూలై 10–14 తుది నివేదిక సమర్పణ ఉంటుందన్నారు. ప్రజలు భాగస్వామ్యంతో నాణ్యమైన పనులు చేపట్టి, సాగునీరు శివారు భూములు వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలువలు, బోదుల ఆక్రమణలను తొలగించే దిశగా కృషి చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు మేరకు పనులను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, వివిధ శాఖలు అధికారులు, నీటి సంఘాలు అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 

..................................