చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్‌లో చలివేంద్రం ప్రారంభం,
చింతలపూడి పట్టణంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ సమీపంలో మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ, నగర పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును
చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ,
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేలా
చలివేంద్రాల ఏర్పాటు చేపట్టడం ఎంతో అవసరమని తెలిపారు.
ఈ చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, పాదచారులు, స్థానిక ప్రజలు శుద్ధమైన చల్లని తాగునీటిని పొందగలరని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చలివేంద్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని *నవతేజ* ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి తన సౌహార్ధత్వం చాటుకుంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

