Ticker

6/recent/ticker-posts

అక్రమాలకు కేరాఫ్‌గా తహశీల్దార్ కార్యాలయం?, తహశీల్దార్‌, అనుముల**


                     విజయ హాసం 

 అనుములలో భూ రికార్డుల వివాదం!సర్వే నంబర్‌ 301లో పట్టాలపై వివాదం.. ఉన్నతాధికారులకు రైతుల ఫిర్యాదుసర్వే అనంతరం పరిశీలిస్తామన్న తహశీల్దార్‌ చందర్‌రావు

 నల్గొండ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మండలడల పరిధిలో భూ రికార్డులు, పట్టాల నమోదుకు సంబంధించి వివాదం వెలుగులోకి వచ్చింది. అనుముల గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 301లో భూమి విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, క్షేత్రస్థాయి స్వాధీనానికి సంబంధించి తేడాలు ఉన్నాయని కొందరు రైతులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు తేలాలంటే సంబంధిత భూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర పరిశీలన అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భూమి విస్తీర్ణంపై సందిగ్ధంఅనుముల గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 301లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 14.20 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. ఈ భూమికి సంబంధించి భిక్షంరెడ్డి కుటుంబ వారసత్వ హక్కులు, గతంలో జరిగిన భూ విక్రయాలు, ప్రస్తుత యాజమాన్య వివరాలపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.భిక్షంరెడ్డి గతంలో కొంత భూమిని తులస్య నాయక్‌, సైదులు అనే వ్యక్తులకు విక్రయించినట్లు సమాచారం. అనంతరం తులస్య నాయక్‌ నుంచి 1.20 ఎకరాల భూమిని మల్‌రెడ్డి సత్యనారాయణరెడ్డి కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే అదే భూమికి సంబంధించి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం తలెత్తింది.తాము సంబంధిత భూమిని విక్రయించలేదని, పత్రాల ఆధారంగా జరిగిన నమోదుపై సందేహాలు ఉన్నాయని భిక్షంరెడ్డి కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై సంబంధిత పత్రాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది. రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో తేడాలున్నాయా?

సర్వే నంబర్‌ 301లో భూమి విస్తీర్ణం, వారసత్వ హక్కులు, రికార్డుల్లో నమోదైన వివరాలు, క్షేత్రస్థాయి స్వాధీనం మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని కొందరు రైతులు పేర్కొంటున్నారు. సాదా బైనామా, 13బీ పత్రాల ఆధారంగా జరిగినట్లు చెబుతున్న నమోదులపై కూడా వివరణ కోరుతున్నారు.

భూ రికార్డుల్లోని వివరాలు, గతంలో జరిగిన లావాదేవీలు, సంబంధిత అధికారుల ఆదేశాలను సమగ్రంగా పరిశీలిస్తేనే వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత పత్రాలను ధ్రువీకరించి, అన్ని పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గతంలో రద్దయిన రిజిస్ట్రేషన్‌పై ప్రశ్నలు

సర్వే నంబర్‌ 301లో భిక్షంరెడ్డి భూమికి సంబంధించి కృష్ణారెడ్డి పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్‌ను 2023 అక్టోబర్‌ 31న అప్పటి జిల్లా కలెక్టర్‌ రద్దు చేసినట్లు సమాచారం. అనంతరం 13బీ సర్టిఫికెట్‌ ఆధారంగా మళ్లీ పట్టా నమోదు జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారుఈ ప్రక్రియలో గతంలో జారీ చేసిన ఆదేశాలు, తదుపరి సమర్పించిన పత్రాలు, రిజిస్ట్రేషన్‌కు అనుసరించిన నిబంధనలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. సంబంధిత రికార్డుల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారా? భూమి హక్కులు, స్వాధీనంపై క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదులోని అంశాలపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, విచారణ ఏ దశలో ఉందనే వివరాలు అధికారికంగా వెల్లడైతే వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం

**మల్‌రెడ్డి సత్యనారాయణరెడ్డి, రైతు (హాలియా)**అనుముల గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 301లో తాము కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఇతరుల పేర్లపై పట్టాలు నమోదయ్యాయని మల్‌రెడ్డి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ తమకు స్పష్టత రావాల్సి ఉందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, సంబంధిత పత్రాలను ధ్రువీకరించిన అనంతరం సమస్యను పరిష్కరించాలని కోరారు స ర్వే అనంతరం పరిశీలిస్తాం          *చందర్‌రావు,తహశీల్దార్‌అనుముల**

సర్వే నంబర్‌ 301లో పట్టాలు చేయాలని కొంతమంది రైతులు కోరుతున్నారని తహశీల్దార్‌ చందర్‌రావు తెలిపారు. భూమి రికార్డుల్లో ఒకరి పేరుతో నమోదు ఉండగా, క్షేత్రస్థాయి స్వాధీనానికి సంబంధించి వేరే వివరాలు ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో సర్వే నిర్వహించిన అనంతరం అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు. ప్రస్తుతం ఎవరూ అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

సమగ్ర విచారణతోనే తేలనున్న వాస్తవాల

అనుముల భూ వివాదంలో సంబంధిత రైతుల వాదనలు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, గతంలో జారీ చేసిన అధికారిక ఆదేశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అన్ని పక్షాలకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించి, నిబంధనల ప్రకారం అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటే భూమి యాజమాన్యంపై నెలకొన్న సందిగ్ధతకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.