Ticker

6/recent/ticker-posts

పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా బీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పోలవరం నియోజకవర్గానికి రూ.25 కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు



                          విజయహాసం 

 పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం  01/10/2026

పల్లె పండుగ 3.0లో పోలవరం నియోజకవర్గానికి రూ.25 కోట్ల కేటాయింపుగ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి పెద్దపీట.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా బీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పోలవరం నియోజకవర్గానికి రూ.25 కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.గురువారం కొయ్యలగూడెం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

                   మండలాల  వారీగా కేటాయింపులు:

 కొయ్యలగూడెం మండలం: 25 సీసీ రోడ్లకు రూ.2.17 కోట్లు బుట్టాయగూడెం మండలం: 9 బీటీ రోడ్లకు రూ.4.05 కోట్లు కుక్కునూరు మండలం: 9 బీటీ రోడ్లకు రూ.4.10 కోట్లు- వేలేరుపాడు మండలం: 4 బీటీ రోడ్లకు రూ.1.85 కోట్లు

 పోలవరం మండలం: 22 సీసీ రోడ్లకు రూ.2.45 కోట్లు

- టి.నర్సాపురం మండలం: 9 బీటీ రోడ్లకు రూ.4.40 కోట్లు

- జీలుగుమిల్లి మండలం: 14 బీటీ రోడ్లకు రూ.6.30 కోట్లు

ఈ నిధులతో నియోజకవర్గంలో మొత్తం 27.28 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 8.50 కిలోమీటర్ల సీసీ రోడ్లు నూతనంగా నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో అవసరమైన నిధులను తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీఓ రాముల నాయక్,ఎమ్మార్వో నాగరాజు,ఎంపిడిఓ కిరణ్ కుమార్,కూటమి నాయకులు గొలిశెట్టి శ్రీనివాస్, గొలిశెట్టి వాసు, చెరువూరి శ్రీను, నాగేశ్వరరావు, మజ్జి చిరంజీవి, శివకుమార్, గంట రమేష్, గంట మురళి, మారిశెట్టి సాయి, పద్ధం వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.