Ticker

6/recent/ticker-posts

బాపులపాడు మండలంలో రూ.4.45 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*పల్లె పండుగ–3.0లో భాగంగా పలు సీసీ, బీటీ రహదారిపనులకు శ్రీకారం*

 *బాపులపాడు, బాపులపాడు అమరావతి విజయాసం పత్రిక ఎం వి వి సత్యనారాయణ 



మండలంలో రూ.4.45 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*పల్లె పండుగ–3.0లో భాగంగా పలు సీసీ, బీటీ రహదారిపనులకు శ్రీకారం*కోడూరుపాడు–శోభనాద్రిపురం పరిధిలో రూ.1.80 కోట్లతో రహదారి నిర్మాణ పనులు*బాపులపాడు టౌన్, మడిచర్ల, కొయ్యూరు, సింగన్నగూడెం గ్రామాల్లో రూ. 1.27 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులు*బిల్లనపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.1.38 కోట్లతో పనులు*గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందన్న యార్లగడ్డ**పల్లె పండుగ–3.0తో గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశామని వెల్లడి**గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని స్పష్టం*ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేయని గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే*పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా బాపులపాడు మండలంలో రూ.4.45 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ, బీటీ రహదారి అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. బాపులపాడు మండలం కోడూరుపాడు – శోభనాద్రిపురం గ్రామాల పరిధిలో రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో సీసీ, బీటీ రహదారి నిర్మాణ పనులు, హనుమాన్ జంక్షన్ ఐటీఐ కాలేజీ రోడ్డు, సాయిబాబా మందిరం సమీపంలో బాపులపాడు టౌన్, మడిచర్ల, కొయ్యూరు, సింగన్నగూడెం గ్రామాలకు సంబంధించి రూ.1.27 కోట్లతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు, శాస్కీ వర్క్ ద్వారా బిల్లనపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.1.38 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి రహదారి అనుసంధానం, మౌలిక వసతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గతంలో కనీస రహదారి నిర్వహణ కూడా చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఒక్కో గ్రామంలోనే కోట్ల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బాపులపాడు మండలంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, బాపులపాడు టౌన్‌లో రూ.7.72 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కోడూరుపాడు, శోభనాద్రిపురం, బిల్లనపల్లి తదితర ప్రాంతాల్లో దశలవారీగా రహదారి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు  తావులేదని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేయని గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేసి గన్నవరం నియోజకవర్గానికి గత వైభవాన్ని తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. గన్నవరం నియోజకవర్గ యువతకు ఉచితంగా ఏఐఎంఎల్, సెమీకండక్టర్ రంగాల్లో శిక్షణ అందించే అవకాశాలను కల్పిస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ సంస్థల సహకారంతో అందిస్తున్న ఈ శిక్షణకు బయట లక్షల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉన్నప్పటికీ, నియోజకవర్గ యువతకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంతాల యువతకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సహకరించాలని కోరారు. ప్రతి గ్రామంలోని అర్హులైన యువతకు ఈ అవకాశాల గురించి తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. యువత ఈ అవకాశాలను వినియోగించుకుంటే భవిష్యత్తులో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పల్లె పండుగ–3.0లో భాగంగా చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.