Ticker

6/recent/ticker-posts

27/9/2026,ఉయ్యూరు, అమరావతి విజయ హాసం సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాజేంద్ర ప్రసాద్ హామీ .* ఇచ్చారు ఇచ్చారు

 27/9/2026,ఉయ్యూరు, అమరావతి విజయ హాసం 

 *VRAల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాజేంద్ర ప్రసాద్ హామీ .* తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న VRA లు ఈరోజు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ గారిని కలుసుకుని తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని రాజేంద్రప్రసాద్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...VRAలు ఎదుర్కొంటున్న ఉద్యోగ, సేవా సంబంధిత సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న VRAల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారుVRAల ఆవేదనను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, మీ యొక్క  న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజేంద్ర ప్రసాద్ గారు వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యను కేవలం ఒక వర్గం సమస్యగా కాకుండా, వారి కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పరిగణించి పరిష్కారం చూపేందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు సానుభూతితో తప్పక పరిశీలిస్తారని రాజేంద్ర ప్రసాద్ భరోసా ఇచ్చారు.. 


ఈ కార్యక్రమంలో VRA లా సంఘం ఉయ్యూరు మండలం కంకిపాడు మండలాలకు చెందిన నాయకులు, VRA లు పాల్గొన్నా రు....