Ticker

6/recent/ticker-posts

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమేప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు**దంటగుంట్ల గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపంపిణీ**బాపులపాడు మండలంలో పలు అభివృద్ధి పనులప్రారంభోత్సవం*

 



గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు బుధవారం బాపులపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా దంటగుంట్ల మరియు కాకులపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం 'ఎన్టీఆర్ భరోసా' పథకం ద్వారా లబ్ధిదారులకు అత్యధిక పెన్షన్ అందిస్తూ అండగా నిలుస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దంటగుంట్ల గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే స్వయంగా అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులు ఇతర లబ్ధిదారులను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి  తెలుసుకొని వారికి పెన్షన్ సొమ్ము అందచేశారు. పెన్షన్ల పంపిణీ అనంతరం అదే గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ వ్యక్తిగా మారిపోయి, కూలీలతో కలసి స్వయంగా పలుగు, పారా పట్టుకుని వారితో కలిసి కొంతసేపు పనిచేశారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ఉపాధి పనుల నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా యార్లగడ్డ పలు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. దంటగుంట్ల గ్రామంలో రూ. 5.00 లక్షలతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్, అలాగే ఎంపీ లాడ్స్ నిధులు రూ. 7.00 లక్షలతో నిర్మించిన మోటార్ మరియు హెచ్‌డీపీఎఫ్ పైప్‌లైన్ పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలో రూ. 2.14 లక్షలతో నిర్మించిన డొంక రోడ్డును ప్రారంభించారు. బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో సుమారు రూ. 50.00 లక్షల భారీ వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, దంటగుంట్ల గ్రామ సర్పంచ్ యజ్జువరపు వెంకట రంగారావు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, రాష్ట్ర టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, బాపులపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు వడ్డీ శివనాగేశ్వరరావు, టిడిపి నాయకులు పుట్టా సురేష్, డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, చింతల వెంకట అప్పారావు, చలసాని శ్రీనివాసరావు, జాస్తి భూపతి, అన్నే చైతన్య, గలావలి వీర వెంకట సత్యనారాయణ, యజ్జువరపు శ్రీనివాసరావు, నోచర్ల శ్రీనివాసరావు, చెన్నుబోయిన వీర వెంకట్రావు, కాలి రమేష్, దన్నే దుర్గారావు, దాసరి కిషోర్, వరిగంజి కిషోర్, దన్నే మల్లిఖార్జునరావు, రాజులపాటి నాగరాజు, చల్లగుళ్ల సందీప్, లంకా అజయ్, కొల్లూరు చంద్రకాంత్, అట్లూరి శ్రీనివాసరావు, కాటూరి విజయభాస్కర్, యజ్జువరపు గణపతి, చంద్రమౌళి మరియు ఎన్డీయే పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.