Ticker

6/recent/ticker-posts

బూతుమిల్లిపాడులో రూ. 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*

 *


బూతుమిల్లిపాడులో రూ. 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*

 గన్నవరం మండలం బూతుమిల్లిపాడు గ్రామంలో రూ. 23.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు వ్యవసాయ సలహాలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పటికీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ. 3 లక్షల కొరత ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ తరుణంలో విమానాశ్రయ మాజీ డైరెక్టర్, గ్రామస్తుడు ముక్కాముల సుబ్బారావు పెద్ద మనసుతో రూ. 3 లక్షల విరాళం అందించడం వల్లే ఈ భవనం పూర్తయిందని ఆయన ప్రశంసించారు. సుబ్బారావు ను ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి భూస్వాములు, రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న 30 మీటర్ల రోడ్డు, చిన్న డ్రెయిన్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే, బుద్ధవరం పంచాయతీకి సంబంధించి దాదాపు 40-50 ఇళ్లను బూతుమిల్లిపాడులో విలీనం చేయాలన్న గ్రామస్తుల కోరికపై ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడానని, సెన్సస్ ఇష్యూ నేపథ్యంలో ఎంఆర్ఓ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. గ్రామ ఆలయానికి సంబంధించిన భూమి కొలతలు పూర్తీ చేసి, అవసరమైతే టీటిడీ నుంచి నిధులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నియోజక వర్గ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌కు చెందిన ఒక సైంటిఫిక్ టీమ్‌తో సుదీర్ఘంగా చర్చించానని, రాబోయే రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్‌తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర నిధులే కాకుండా, కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు రూ. 200 నుంచి 300 కోట్ల నిధులు తీసుకువచ్చేలా అధ్యయనం చేస్తున్నామని, తద్వారా గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.గన్నవరం ఏఏంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, వైస్ ఎంపీపీ కొమ్మురాజు సుధీర్, ఏఓ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పేరం సుబ్బారావు, కొలుసు రవీంద్ర, బూతిమిల్లిపాడు గ్రామ టిడిపి అధ్యక్షులు సవలం దినేష్, బోడపాటి రవి, ముద్రబోయిన శ్రీనివాసరావు, బుస్సే నాగప్రసాద్, కొసరాజు సాయిరాం, కంభంపాటి లక్ష్మీ నరసమ్మ, బెజవాడ నాగేశ్వరరావు, యనమదల సతీష్, అంకెం రామారావు, సూరిబోయిన రాంబాబు, అన్నే హరికృష్ణ, కారంపూడి కుమారి, షేక్ కరీముల్లా, పందేటి చిరంజీవి మరియు ఎన్డీయే పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.