చింతలపూడి,*ఇది ప్రజా ప్రభుత్వం* *సంక్షేమం- అభివృద్ధి రెండింటికి అధిక ప్రాధాన్యం*---ఎమ్మెల్యే రోషన్ కుమార్ *చింతలపూడి మండలం వెంకటాద్రి గూడెంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేశారు*.
*ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పేడుతున్నారని, అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసే ప్రజా ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అని రోషన్ కుమార్ పేర్కొన్నారు*
*ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 18 నెలలు కాలంలో అన్ని నెరవేర్చి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్ని రంగాల్లో అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు*
*ప్రజల అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలో ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామన్నారు*
*రాష్ట్రంలో సుస్థిరం పాలన ఉంటే అభివృద్ధి అనివర్యమని ప్రజలు గుర్తించాలన్నారు*
తాము అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దశల వారిగా అమలు చేస్తున్నామని ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు
కార్యక్రమంలో అధికారులు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు

