జిల్లాలో 2,56,935 మందికి రూ.112.89 కోట్ల రూపాయల పంపిణీ*ఏలూరు 35వ డివిజన్ లో సామజిక పెన్షన్లు పంపిణీ చేసినజిల్లాకలెక్టర్ కె. వెట్రిసెల్వి*
ఏలూరు, ఏప్రిల్, 1 : ఏలూరు జిల్లాలో ఏప్రిల్ నెలకు గాను 2 లక్షల 56 వేల 935 మందికి 112. 89 కోట్ల రూపాయలను సామజిక పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక 35వ డివిజన్ లోని కంకణాల వీధిలోని పేదలకు బుధవారం సామజిక పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కింద జిల్లాలోని 2,56,935 మందికి రూ 112.89 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని, ఇందుకు జిల్లాలో 5016 మంది వార్డు, గ్రామ సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందితో పింఛన్లు పంపిణీ పక్కా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు. 1వ తేదీనే నూరుశాతం పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. పింఛన్లు పొందేందుకు లబ్ధిదారులు వారి ఇండ్లలో అందుబాటులో ఉండేలా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ముందస్తు సమాచారం అందించామని తెలిపారు. కదలలేని వృద్దులు, దివ్యంగులకు వారి ఇంటివద్దనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
డిఆర్ డిఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రీదేవి, స్థానిక ప్రముఖులు అలజంగి శ్రీనివాసరావు, కొల్లేపల్లి రాజు, భీమవరపు పాపారావు, ఈదుపిల్లి దుర్గాప్రసాద్, చలమాల నాగు తదితరులు పాల్గొన్నారు



