బాపట్ల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పాలిట పెన్నిధి నారా చంద్రబాబు నాయుడు - బీమా చెక్కు అందజేతలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు.
"తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది కార్యకర్తల సంక్షేమాన్ని ప్రాణంగా భావించే ఒక గొప్ప కుటుంబం" అని బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు కొనియాడారు. బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త పరిశా వాణి గారు
, బాపట్ల మండలం భర్తిపూడి గ్రామానికి చెందిన మనుబ్రోలు వెంకటేశ్వర్లు గారు, పిట్టలవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారి పాలెం గ్రామానికి చెందిన నల్లిబోయిన శ్రీనివాసరావు గారు ప్రమాదవశాత్తు మరణించగా, వారికి మంజూరైన రూ. 5 లక్షల ప్రమాద బీమా పత్రాలను మరణించినవారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ :
దేశ రాజకీయాల్లోనే ఏ పార్టీ చేయని విధంగా, కేవలం ₹100 సభ్యత్వంతో ₹5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన ఘనత మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. కార్యకర్త కష్టంలో ఉన్నా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబాన్ని రోడ్డున పడనీయకుండా చూసే గొప్ప మానవతావాది ఆయన. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి సంక్షేమం కోసం చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం నేడు చనిపోయిన వారి కుటుంబానికి కొండంత అండగా నిలిచిందని పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వం మరియు పార్టీ పరంగా అంకాలు కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూనే, మరోవైపు కార్యకర్తల సామాజిక భద్రత కోసం ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని, ఆయన నాయకత్వంలో పనిచేయడం మనందరి అదృష్టమని నరేంద్ర వర్మ రాజు గారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రముఖులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

