జిల్లా అభివృద్ధి దిశగా సమగ్ర ప్రణాళికలపై దృష్టి భీమవరంలోని జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన “బడ్జెట్ ఔట్‌రీచ్” సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
“స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్య సాధనలో భాగంగా తలసరి ఆదాయం పెంపు, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. అధికారులు ముందస్తు ప్రణాళికలతో బడ్జెట్ వినియోగం చేయాలని, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని జిల్లాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా సూచనలు చేశారు.

