Ticker

6/recent/ticker-posts

ఇంటి వద్దే పెన్షన్ పంపిణీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ*ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ ప్రక్రియను జిల్లాకలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 14వ స్వర్ణ వార్డు, ప్రకాష్ నగర్-01 ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకుని, పెన్షన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతున్నదా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.


రాజమహేంద్రవరం, తేది: 01.04.2026








*ఇంటి వద్దే పెన్షన్ పంపిణీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ*ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ ప్రక్రియను జిల్లాకలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 14వ స్వర్ణ వార్డు, ప్రకాష్ నగర్-01 ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకుని, పెన్షన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతున్నదా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్థానిక దానవాయిపేటలో పాన్ షాప్ నిర్వహిస్తున్న కూరపాటి ధనలక్ష్మికి సంబంధించిన దివ్యాంగ పెన్షన్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి, మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి, పెన్షనర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి, జీవనోపాధి గురించి వివరాలు తెలుసుకుని, స్వయం ఉపాధి ద్వారా ముందుకు సాగుతున్నందుకు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.


జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మొత్తం 2,69,753 మందికి రూ.118,56,75,000లను ఏప్రిల్ 1న పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 22 మండలాలు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు 3 పురపాలక సంఘాల పరిధిలో లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతోందన్నారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలో 2,37,032 మంది (88 శాతం) లబ్ధిదారులకు రూ.103,62,54,000లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన పెన్షన్ అందించేందుకు క్షేత్రస్థాయిలో పిడివోలు (PDOలు) పని చేస్తున్నారని తెలిపారు.


 *సి ఎం కు కృతజ్ఞతలు తెలిపిన ధనలక్ష్మి*..


 

ఈ సందర్భంగా కూరపాటి ధనలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం తన ఇంటి వద్దనే పెన్షన్ అందించడం ఎంతో సౌకర్యంగా ఉందని, ఈ నెల స్వయంగా కలెక్టర్, కమిషనర్ వచ్చి అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.6,000 తన జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డీఆర్‌డీఏ పీడీ బి. నగేష్, ఆర్‌ఎంసీ కార్యదర్శి శైలజ వల్లి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


-----------


జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం