Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితకు, పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ...




*ఏలూరు జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితకు, పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ...


ఏలూరు, ఏప్రియల్ 09: అప్పన్నవీడులో గురువారం అభయాంజనేయ స్వామి వారిని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి, వేద పండితులు మంత్రికి ఆశీర్వవచనాలు అందించారు. ఆలయ పాలకవర్గం చైర్మన్  మంత్రికి అభయఆంజనేయ చిత్రపటాన్ని బహూకరించారు. హోంశాఖ మంత్రి శ్రీమతి అనితకు సాంప్రదాయ బద్దంగా చీర, సారెను  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించారు.

హోం మంత్రి వెంట ఏలూరు ఎమ్మెల్యే  బడేటి రాధాకృష్ణయ్య (చంటి), రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు,  ఆలయ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.