పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నిధులనుంచిగ్రామల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర వాతావరణం : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*మండలంలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నిధులనుంచి రూ. 9.50 లక్షలతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్ ను బుధవారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు.
గ్రామాల పరిశుభ్రత తోనే మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ప్రభుత్వం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మండలంలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నిధులనుంచి రూ. 9.50 లక్షలతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్ ను బుధవారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెత్త సేకరణకు అవసరమైన వనరులను సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ చిన్న గ్రామంలో రూ.2.30 కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం ఎంతో అవసరం అన్నారు. సర్పంచ్ మాదాల రోహిణి, టీడీపీ నాయకులు గూడపాటి తులసి మోహన్, గుమ్మడి వెంకట్రామయ్య, తుమ్మల లక్ష్మణరావు, మోపర్తి కోటేశ్వరరావు, నక్క శ్రీనివాసరావు, చదలవాడ కోటేశ్వరరావు గుత్తికొండ కొండలరావు, తుమ్మల వెంకటేశ్వరరావు, మాదల సాంబశివరావు, బోడపాటి రవి, మల్లారెడ్డి కిషోర్, బండి భాస్కర్, అన్నే హరికృష్ణ, దేవరపల్లి కోటేశ్వరరావు, కొసరాజు సాయి, కొమ్మినేని సుధీర్ తదితరులు పాల్గొన్నారు.





