Ticker

6/recent/ticker-posts

వాసవి క్లబ్ గోల్డ్ వనిత కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోకుల పారిజాత గిరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మను సాలువతో సత్కరించి, క్రోటాన్ మొక్కలను అందజేశారు


  •  జంగారెడ్డిగూడెం, :వాసవి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పెరిగే కాకుండా, మహిళా సాధికారికత కోసం ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఏ ఎస్ పి సుస్మితా రామనాథన్ అన్నారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం, వాసవి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏఎస్పీ సుస్మితా రామనాథన్, గోకుల పారిజాత గిరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మను సాలువతో సత్కరించి, క్రోటాన్ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను ఆమె కొనియాడారు. అదేవిధంగా వందనపు సాయిబాల పద్మ మాట్లాడుతూ కేవలం వంటింటికే పరిమితం కాకుండా, మహిళలు అన్ని రంగాలలో రాణించేలాగా ముందుకు సాగే విధంగా ప్రతి పురుషుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రమణ్యం, సెక్రటరీ పుష్కర్, కోశాధికారి మహేష్ కుమార్, వాసవి క్లబ్ గోల్డ్ వనిత అధ్యక్షురాలు భూమా విజయ, సెక్రటరీ పద్మజ, కోశాధికారి వాణి, సీనియర్ క్లబ్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, కొల్లేపర ఆనంద్, సొలస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు