Ticker

6/recent/ticker-posts

తాడేపల్లిగూడెం: హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ & మెడికల్ క్యాంప్


పగో జిల్లా: తాడేపల్లిగూడెం :తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోనిహెచ్‌పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సిన్ వేయడం జరిగింది. వీకర్స్ కాలనీ, ఎన్టీఆర్  జంక్షన్, కడికట్ల ఆరోగ్య కేంద్రాలలో హెచ్‌పివి వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సిన్ వేయడం జరిగింది.హెచ్‌పివి వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారిస్తుందని, ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల బాలికలకు వేయటం జరుగుతుందని, సింగిల్ డోస్ టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది కాబట్టి పబ్లిక్ అర్బన్ హెల్త్ సెంటర్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయడం జరుగుతుందని తెలిపారు.


 కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎం యేసుబాబు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వైద్యులు పాల్గొన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ క్యాంప్:
వీకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్‌కు మెడికల్ టెస్టులు నిర్వహించి, మెడిసిన్‌ను అందించారు.
పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమని, అది పురపాలక సంఘం బాధ్యతని, మెడికల్ క్యాంప్ నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, మెడిసిన్‌ను అందించడం జరిగిందని తెలిపారు.